పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజల సమస్యలు పరిష్కారమే సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి ప్రజల కార్యక్రమం అని పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోఏర్పాటుచేసిన ప్రజాపాలనకు హాజరైన శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరికి అమలు చేసేలా చూడాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజి రెడ్డి, సర్పంచ్ గడ్డం బాలమణి, ఉప సర్పంచ్ శోభక్రిష్ణ రెడ్డి, వార్డ్ సభ్యులు లావణ్య నర్సింహులు, వనిత, భారతి గౌడ్ వనమ్మ, తదితరులు పాల్గొన్నారు.