సమస్య-పరిష్కారం.. విజయానికి సోపానం

Telangana

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మన చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపగలగడం విజయానికి తొలి మెట్టుగా ఎన్ఐటీ రూర్కెలాలోని మెజ్లింగ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సింగం జయంతు అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వాలుల స్థిరత్వంపై జియోటెక్నికల్ పరిశోధన’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఓ సనుస్యను పరిస్కరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, దానిని ఓ ప్రాజెక్టుగా విద్యార్థులు చేపట్టి, వినూత్న పరిష్కారాలతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని సూచించారు.తవ్వకం పూర్తయిన ఓపెన్కాస్ట్ గనులను పూడ్చి, ఆ భూమిని వ్యవసాయానికి పనికొచ్చేలా పునర్వినియోగంలోకి తెచ్చే మార్గాలను, అందులో అనుసరించాల్సిన మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గనులు తవ్వేప్పుడు వచ్చిన మట్టి, వ్యర్థాలతో ఫ్లైయాష్ ను కూడా 3:1 నిష్పత్తిలో కలిపి, వాటిని పూడ్చడానికి వాడాలన్నారు. దానిని బాగా చదును చేయడంతో పాటు రెండు మీటర్ల పైపొరను సారవంతమైన మట్టితో నింపితే, వ్యవసాయం చేసి, పంటలు పండించొచ్చని ప్రొఫెసర్ సింగం తెలియజేశారు. ఈ రంగంలో సహకారం, అవిష్కరణల అవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.తొలుత, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి అతిథిని పరిచయం చేయగా, ఉపన్యాసం ముగిశాక సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి అఖిలేష్ దేపూరి అతిథిని సత్కరించారు.హెబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ అతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. మెల్డింగ్ ఇంజనీరింగ్లో వినూత్న పరిశోధనలు, తాజా పురోగతిపేటై అనగాహనను ఏర్పరచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *