ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటియువత చెడు వ్యసనాలకు బానిసకాకూడదని సినీ నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి అన్నారు .కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిత్రీకరించిన అడిక్ట్ చిత్రం పోస్టర్ ను ఎస్ ఎమ్ టి కాలని సామాజిక సేవకులు రూపా జగదీష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ అడిక్ట్ చిత్రం బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసకావద్దని మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని సమాజంలో చాలా మంది యువకులు కొంత మంది విద్యార్థులు మత్తుకు ఆడిక్ట్ అయి వారి జీవితలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వారిని మార్చలనే ఉద్దేశంతో అడిక్ట్ చిత్రం యూనిట్ సభ్యులను అభినందించారు అలాగే ఈ చిత్రం నిర్మించిన విలేఖరి షబ్బీర్ ఇంకా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఎన్నో తీయాలని అన్నారు అనంతరం విలేఖరి షబ్బీర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ న మంగళవారం నాడు పట్టణంలోని శ్రీనివాస టాకీస్ లో ఉదయం 9:00 గ.విడుదల అవుతుందని తెలిపారుఈ కార్యక్రమంలో ఆడిక్ట్ చిత్రం హీరో,ఇమ్రాన్,విలన్ వీరేశ్,కెమెరా మెన్స్ చాంద్,ఖాలీద్,నటులు యూసుఫ్,వసుంధర తదితరులు పాల్గొన్నారు.