14వ గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని 

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు 14వ గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. చేతితో తయారు చేసిన 2,700 కాగితం బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు శివాలీ కుటుంబానికి వరంగా మారింది. ఏకంగా విశ్వ యవనికపై విజయకేతనం ఎగురవేయడానికి తోడ్పడింది. అదీ ఏదో ఒకటీ.. రెండూ.. కాదు, ఏకంగా 14 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులతో పాటు నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు. హెదరాబాద్లోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్లు కలిగి ఉండడం కూడా మరో రికార్డుగా వినుతికెక్కడం విశేషం.ఇంతకు మునుపు, శివాలి కుటుంబం హ్యాండ్ మేడ్ పేపర్తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి మలి రికార్డు, 2,111 విభిన్న బొమ్మలు, 3,501 ఆరెగామి వేల్స్, 2,100 ఆరెగామి పెంగ్విన్స్, 6,132 ఆరెగామి సిట్రస్ (నిమ్మ తొన)లు, 6,100 ఆరెగామి వేల్స్, 2,500 ఆరెగామి పెంగ్విన్స్, 1,451 ఆరెగామి మాప్లీలు, 2,200 క్విల్లింగ్ డాల్స్, 9,200 ఆరెగామి ఫిష్, 1,993 ఆరెగామి మాప్లీ లీవ్స్లను ప్రదర్శనకు ఉంచి ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న విషయం విదితమే.మొత్తం 14 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *