గీతమ్ లో క్విజ్, గణిత నమూనా ప్రదర్శన పోటీలు

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ లోని గణిత శాస్త్ర విభాగం డిసెంబర్ 21-22 తేదీలలో జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్ పోటీతో పాటు గణిత నమూనా ప్రదర్శన, గీతం విద్యార్థుల కోసం గణిత క్విజ్ పోటీలను నిర్వహించనుంది. ఈ విషయాన్ని గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులకు గణిత శాస్త్రంపై మక్కువను పెంపొందించడం, వారి గణిత నెపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఈ పోటీలలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా రెండు ఆతిథ్య ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేశామని, రామానుజన్ చరిత్ర, ఆయన సేవల గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం పూర్య ఆచార్యుడు ప్రొఫెసర్ కె. సత్యనారాయణ, కొన్ని సరదా వాస్తవాల గురించి గీతం సీఎస్ఈ డీన్ ప్రొఫెసర్ సి. విజయశేఖర్ ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు.ఆసక్తి గలవారు ఈ పోటీ కోసం తను పేర్లను ఈనెల 20వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, విజేతలను నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని డాక్టర్ మల్లికార్జున్ తెలియజేశారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ నిర్వాహకుడి (98493 17334)ని సంప్రదించాలని సూచించారు.

గీతము సందర్శించిన ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులు 

సికింద్రాబాద్ లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులు సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు. దాదాపు 230 మంది కంప్యూటర్ సెన్స్డ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ఇంజనీరింగ్ డిప్లొమోతో పాటు హోమ్ సెన్ట్స్ విద్యార్థులు, తమ అధ్యాపకులతో కలిసి వచ్చారు.గీతం నిర్వహిస్తున్న కార్యాచరణ – ఆధారిత అభ్యాసం ప్రత్యక్ష అనుభవాన్ని విద్యార్థులకు అందించడం ఈ సందర్శన ప్రాథమిక లక్ష్యం. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సెన్స్కు చెందిన అధ్యాపకులు వారితో ముఖాముఖి నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల ల్యాబొరేటరీలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను చూపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి అధ్యాపకుల కోసం వర్క్షాప్లు, అధ్యాపక వికాస కార్యక్రమాలను గీతం నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఈ పర్యటనలను ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *