ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎసీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ‘అధ్వరస్థంలో మన్నికెన్ట్, స్థిరమెనై, పర్యావరణ హిత కాంక్రీట్ కోసం స్లాగ్ బేస్డ్ ఉత్పత్తి వినియోతంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ఓపీసీగా పిలిచే సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ వంటి సంప్రదాయ వనరుల లభ్యత క్షీణిస్తున్నందున, భవిష్యత్తు తరాలకు ప్రత్యామ్నాయ సిమెంటేషన్ పదార్థాల అవసరం ఏర్పడిందన్నారు. సిమెంట్ ఉత్పత్తి కాలుష్యానికి దారితీస్తున్నందున, పర్యావరణ పరిరక్షణకు, నిర్మాణ అవసరాలను తీర్చడానికి ఫ్లెయాప్, మెక్రో సిలికా, వరిపొట్టు, జీజీబీఎస్ వంటి ప్రత్యామ్నాయాల అన్వేషణ మొదలైందన్నారు.జీజీబీఎస్ను ఉపయోగించడం ద్వారా థర్మల్ క్రాస్లు, ప్రాజెక్టు ఖర్చు, వేడిని గణనీయంగా తగ్గించడమే గాక కాంక్రీటు నిర్మాణాల మన్నిక పెరిగి, దీర్ఘకాలం దృఢంగా ఉంటాయని పణ్ముఖరెడ్డి చెప్పారు. మట్టి స్థిరీకరణలో కూడా జీజీబీఎస్ క్రియాశీలపాత్ర పోషిస్తోందని, తద్వారా జాతీయ రహదారులు, సబ్వేలలో దీని వినియోగం పెరిగిందన్నారు. గీతం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటి, ఆకుపచ్చ, స్వచ్ఛమైన పర్యావరణ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్ చేపూరి అతిథిని సత్కరించి, గీతం-జేఎస్ డబ్ల్యూల మధ్య నిరంతర భాగస్వామ్యం కొనసాగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.