Telangana

90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాప

ముత్యంలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్ చెరు,మనవార్తలు ప్రతినిధి

ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

శనివారం పటాన్చెరు మండల పరిధిలోని పోచారం, ముత్తంగి, చిట్కుల్, రామేశ్వరం బండ, బచ్చు గూడెం, ఇంద్రేశం, ఐనోలు, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామాలలో 95 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపటనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతినెల నిధులు అందిస్తూ, పారదర్శకంగా ఖర్చు చేయడం జరుగుతోంది తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లేనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుందని తెలిపారు..

అనంతరం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో నూతన రామాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీడీవో బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

9 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

11 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago