మనవార్తలు ,రామచంద్రపురం
శ్రీహరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్యామసుందర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రజ్ఞ చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి చైర్మన్ బలరాంకు ప్లే బ్యాక్ సింగర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గా చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రధానోత్సవం చేయడం అనందంగా ఉందని బలరాం అన్నారు. నిస్వార్ధంగా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో సంతృప్తి ఉంటుందని, భవిష్యత్తులోను మాపౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో ముందుకు వెళ్తామని, లాక్ డౌన్ సమయంలో ని తమ వంతు సహకారాన్ని అందించేందుకు చేసిన సేవలకు గుర్తింపుగా గా 36 వ వార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ,శ్రీ బాలాజీ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.