మనవార్తలు ,హైదరాబాద్:
వినియోగదారులకు మరిన్ని ఆధునిక ఉత్పత్తులు అందించడంలో భాగంగా సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్. జాన్సన్ (ఇండియా) హైదరాబాద్లో ఏకంగా మూడు వేల కొత్త టైల్ డిజైన్లను ప్రదర్శించింది. ఇక్కడి నోవాటెల్ హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రిజం జాన్సన్ యెక్క విభాగమైన హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఆధ్వర్యంలో మేగా ప్రదర్శన నిర్వహించించి. ప్రిజం జాన్సన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అగర్వాల్ టైల్ డిజైన్స్ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు. హెచ్ఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ శరత్ చందక్, హెచ్ఆర్ డివిజన్ టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ మిశ్రా లు కూడా ఆయన తో ఉన్నారు.