280 కిలోల గంజాయి పట్టివేత…

Crime
280 కిలోల గంజాయి పట్టివేత…
– ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
– ఇద్దరూ రిమాండ్
పటాన్ చెరు: 
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న  గంజాయిని ముత్తంగి టోల్​గేట్​ వద్ద మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్​చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా…. జహీరాబాద్ మండలం గోవింద్​పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన బ్యాగరి తుకారాం… ఆంధ్ర ఒరిస్సా నుంచి జహీరాబాద్​కు గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న మెదక్​ డివిజన్​ ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు… మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ గాయత్రి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించారు.
స్కార్పియో వాహనంలో 140 ప్యాకెట్లలో తీసుకెళ్తున్న 280కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి,ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మోహన్, ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు విశ్వనాథ్ ,రాజు, ఎక్సైజ్ ఎస్సై వెంకటేశం, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.