– కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి
– అంత్యక్రియలకు తక్షణ సాయం
బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే కడారు కిషన్ (38 సం”) ఎక్సల్ రబ్బర్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసేవాడు. పరిశ్రమ పనుల నిమిత్తం బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మరియు మున్సిపల్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి పరిశ్రమ యజమాని రఘునాధ్ రెడ్డి తో చర్చించి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పరిశ్రమ నుంచి మృతుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందించేందుకు యజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా అంత్యక్రియల నిమిత్తం తక్షణసాయం అందజేస్తామన్నారు. కష్టకాలంలో కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు, పరిశ్రమ యజమాన్యానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోప్షన్ మెంబర్ మునీర్ , స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి , చంద్రారెడ్డి , శంకర్ , శ్రీనివాస్ , యువజన నాయకులు బషీర్ , అంజి , ఆంజనేయులు, బాధిత కుటుంబ సభ్యులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…