శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు

Hyderabad politics Telangana

పటాన్చెరు

కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన సంస్థలు ,వ్యక్తులను సన్మానించి , అవార్డులతో సత్కరించుకోవడం మన సాంప్రదాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు .హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మగాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 24 వ అవార్డు అని సంస్థ ఛైర్మన్ బలరాం అన్నారు .

గత ఐదేళ్ళుగా ఏన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని…తమ సేవలు గుర్తించి అవార్డులతో సత్కరించడం తమకెంతో సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఛైర్మన్ బలరాం అన్నారు . ఈ అవార్డు దక్కడం వల్ల సామాజిక సేవలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజా సమస్యల పైన ఎన్నో పోరాటాలు చేశామని.. .ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఇన్ని అవార్డులు రావడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైనమిక్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ CBI జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు .ముందు ముందు రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు . ఈ అవార్డులు రావడం వల్ల మరింత బాధ్యతతో సేవ కార్యక్రమాలు నిర్వర్తిస్తామన్నారు. సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని తెలియచేస్తున్నాను ఆర్ కే కళ సాంస్కృతిక ఫౌండేషన్ చైర్మన్ ఆర్ కే రంజిత్ శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరుపున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *