వ్యవసాయ మార్కెట్ యార్డులో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు…

politics

పటాన్ చెరు

నేటి ఆధునిక సమాజం లో సీసీ కెమెరాల ఆవశ్యకత పెరిగిందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ప్రాంగణంలో ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 14 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, వ్యాపారస్తులకు మరింత భద్రత కల్పించినట్లు అయిందన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో సిసి రోడ్లు, షెడ్లు, టాయిలెట్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.

 

దేశంలో భద్రత చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజలను భాగస్వామ్యం చేయడంతో నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు.

నగరంలోని ప్రతి సొసైటీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానురి మల్లారెడ్డి, డైరెక్టర్లు మల్లికార్జున్, శివారెడ్డి, ప్రమోద్ గౌడ్, వంగరి అశోక్, గౌరీ శంకర్,నారాయణ రెడ్డి, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, షకీల్, అజ్మత్, సాగర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *