యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో నూతన సంవత్సర డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీలను బుధవారం రాత్రి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం యువతలో విశేష ఉత్సాహాన్ని […]

Continue Reading

భారతి నగర్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఘన గౌరవం

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ  కార్మికులు, సూపర్వైజర్లకు విశేష సన్మానం రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : నగర పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ భారతి నగర్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు . కార్మికుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తున్నారని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు […]

Continue Reading

పటాన్ చెరు కేంద్రంగానే పటాన్ చెరు సర్కిల్ కార్యకలాపాలు

జిహెచ్ఎంసి కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పటాన్ చెరు సర్కిల్ కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.బుధవారం హైదరాబాదులోని బల్దియా ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ […]

Continue Reading

పటాన్ చెరు కేంద్రంగా నూతన ఏసిపి కార్యాలయం ఏర్పాటు చేయండి

– ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజన్లు ఏర్పాటు చేయండి  -డిజిపి శివధర్ రెడ్డిని కోరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొంది.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న పోలీస్ స్టేషన్ల విభజన ప్రక్రియను ప్రజల అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డిని పటాన్ చెరు శాసన సభ్యులు […]

Continue Reading

ఊయల కార్యక్రమానికి హాజరైన యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ ఛైర్మన్

మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ : మియాపూర్‌కు చెందిన ప్రముఖులు శ్రీ తాండ్ర మహిపాల్ గౌడ్ గారి కుటుంబంలో జన్మించిన నవజాత శిశువు ఊయల కార్యక్రమం మియాపూర్ హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సంప్రదాయ పద్ధతుల్లో, భక్తిశ్రద్ధలతో మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శ్రీ మోహన్ ముదిరాజ్ , శ్రీ పల్లె మురళి  హాజరై నవజాత శిశువును ఊయలలో […]

Continue Reading

గీతంలో రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహణ  140 మంది రక్తదానం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం (31-12-2025న) రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధ్యాపక, విద్యార్థి సమన్వయకర్తలతో కలిసి, గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 140 మంది […]

Continue Reading