శారదా స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో బుధవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సరస్వతి పూజ, హోమం, సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించి నూతన అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు వైట్ యూనిఫామ్, స్లెట్స్ అశ్రీత అందజేశారు. వసంత పంచమి వేడుక విశిష్టత గురించి ప్రన్సిపాల్ నీరజ వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Continue Reading

గీతం స్కాలర్ మాలతికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని విసారపు మాలతిని డాక్టరేట్ వరించింది. ‘వన్-పాట్ త్రీ-కాంపోనెంట్ సింథటిక్ విధానాల ద్వారా పైరన్ ఫ్యూజ్డ్ హెటెరోసెక్ట్రిక్ సమ్మేళనాల సంశ్లేషణ’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నారాయణరెడ్డి బుధవారం విడుదల చేసిన […]

Continue Reading