జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్కులో గల గాంధీ మహాత్ముడి కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రామేశ్వరం బండ గ్రామంలో నూతన పాఠశాల భవనం, సిసి రోడ్లు ప్రారంభోత్సవం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, 60 లక్షల రూపాయలతో వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం […]

Continue Reading

విద్యుత్ సరఫరాకు అంతరాయం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చెట్ల నరికివేత సందర్బంగా బుధవారం రోజు 11కేవీ ఫీడర్‌ పరిధిలోని జేపీ నగర్ ఫీడర్ మదీనగూడ సబ్ స్టేషన్ జేపీఎన్ నగర్ కాలనీ, నాగార్జున ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, మియాపూర్ ఫీడర్ మదీనగూడ సబ్ స్టేషన్ లేక్ వ్యూ ఎన్‌క్లేవ్, రాయ్ అపార్ట్‌మెంట్స్, సత్య కళ్యాణి అపార్ట్‌మెంట్, ఆర్ బి ఆర్ కాంప్లెక్స్, మియాపూర్ ఎక్స్ రోడ్స్, బాలాజీ నగర్, ఆర్ వి అవనీంద్ర […]

Continue Reading

గీతమ్ లో  త్యాగరాజ ఆరాధనోత్సవం 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని ఫైన్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ స్వరకర్త త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ, మనోహరమైన ప్రదర్శనల […]

Continue Reading