ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చర్చిలకు కేకుల పంపిణీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కేకులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం పటాన్చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి చర్చి పాస్టర్లకు కేకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే […]

Continue Reading

నేపాల్ పర్యటనలో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.ఆదివారం మాదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ జానకి మాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, […]

Continue Reading

గీతమ్ లో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం’పై వర్క్ షాప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం: మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్/కృత్రిమ మేథ పాఠ్యాంశాల’పై రెండు రోజల కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, మెకానికల్ ఇంజనీరింగ్ నెపుణ్యం-ఆధారిత విద్యను రూపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి […]

Continue Reading

జనసేన అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు

అమరావతి ,మనవార్తలు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశారు.తాజాగా అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి అయినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, […]

Continue Reading

అ’పూర్వ’ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘హోమ్ కమింగ్’ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు.ఆయా విభాగాల వారీగా విద్యార్థుల సమ్మేళనంతో ఆరంభమైన ఈ కార్యక్రమం, ముఖాముఖి చర్చలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, విశ్వవిద్యాలయంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడంతో […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ గణిత దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్, గణిత నమూనా ప్రదర్శన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర విభాగం పూర్వ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ గణిత శాస్త్రవేత్త 136వ జయంతిని పురస్కరించుకుని […]

Continue Reading

ప్రతి ఒక్కరి కృషితోనే విజయం సాధించాం_పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రభుత్వంలో లేకున్నా ప్రగతి పథంలో ముందుకెళ్తాం _హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు, పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన […]

Continue Reading

జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మమతా బిక్షపతి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు.

గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని శివాజీ ఆడిటోరియంలో గురువారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశంతమైన, రంగు రంగుల గంటలు, నక్షత్రాలతో అలకరించిన ఆడిటోరియం పండుగ శోభను సంతరించుకుంది.స్వాగత వచనాలతో నాంది పలికిని క్రిస్మస్ సంబరాలు, శ్రావ్యమెన పాటలో ఆహూతులందరిలో ఉల్లాసాన్ని నింపాయి. నిండైన పండుగ వాతావరణంలో గీతం విద్యార్థులు ఆలపించిన మనోహరమైన పాటలు, ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలతో వారిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. తమకున్నది ఇతరులతో పంచుకోవడం, […]

Continue Reading

స్వీయ అనుభవం అవశ్యం: ప్రొఫెసర్ ప్రకాష్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రయోగశాలలో ఎలుకలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై ఫార్మసీ విద్యార్థులకు స్వీయ అనుభవం అత్యంత ఆవశ్యకమని హెదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్ బాబు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాలను బుధవారం ముఖ్య అతిథిగా ఆయన జ్యోతి […]

Continue Reading