జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మమతా బిక్షపతి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు.

గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని శివాజీ ఆడిటోరియంలో గురువారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశంతమైన, రంగు రంగుల గంటలు, నక్షత్రాలతో అలకరించిన ఆడిటోరియం పండుగ శోభను సంతరించుకుంది.స్వాగత వచనాలతో నాంది పలికిని క్రిస్మస్ సంబరాలు, శ్రావ్యమెన పాటలో ఆహూతులందరిలో ఉల్లాసాన్ని నింపాయి. నిండైన పండుగ వాతావరణంలో గీతం విద్యార్థులు ఆలపించిన మనోహరమైన పాటలు, ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలతో వారిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. తమకున్నది ఇతరులతో పంచుకోవడం, […]

Continue Reading