శ్రీవారి సేవలో క్రికెటర్ రాబిన్ ఉతప్ప..
మనవార్తలు ,తిరుమల : తిరుమల శ్రీవారిని క్రికెటర్ రాబిన్ ఉతప్ప దర్శించుకున్నారు.శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాబిన్ ఉతప్ప స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయ బయటకు వచ్చిన రాబిన్ ఉతప్పను చూసిన అభిమానులు పోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
Continue Reading