అట్టహాసంగా ముగిసిన మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ

_క్రీడలకు కేంద్రం మైత్రి మైదానం.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _విజేతలుగా నిలిచిన రెడ్ డ్రాగన్.. రన్నర్స్ గా నిలిచిన ప్రిన్స్ ఎలెవన్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ ముగింపు పోటీలు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

_ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు _మైత్రి మైదానంలో అలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు _విజేతలకు సొంత నిధులతో నగదు బహుమతులు.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా […]

Continue Reading

డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

_రేస్‌ విన్ మార్ట్ డిజిటల్ షాప్ యాప్‌ను ప్రారంభించిన సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌  _రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్‌ విన్ మార్ట్ రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ ఆవిష్కరించారు. […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, భద్రతా సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన జ్ఞాపికలు, ప్రత్యేక ప్రశంసా పత్రాలనిచ్చి సత్కరించారు.తొలుత, జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమం, విద్యార్థుల దేశభక్తి గేయాలు, నృత్యాలు, పాటలతో గీతం ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. ఎన్సీసీ-ఎన్ఎస్ఎస్-స్టూడెంట్ లెఫ్, స్పోర్ట్స్ విద్యార్థులు, సెక్యూరిటీ […]

Continue Reading

తృణధాన్యాలను దెనందిన జీవితంలో భాగం చేసుకోండి…

– గీతం విద్యార్థులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన దైనందిన జీవితంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలని, ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా వాటిని భుజించడం అలవరచుకోవాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వెస్ట్ ఛాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది 2023’ […]

Continue Reading

నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో ప్రథమస్థానం సాధించిన నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌశిక్

_విద్యార్థి దశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి నంద్యాల ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ,చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో నంద్యాల విద్యార్థి సత్తా చాటాడు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌషిక్ నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో సింగిల్ ,మక్సిడ్‌ ,డబుల్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు […]

Continue Reading

సాయికిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎంఆర్

– అండగా ఉంటామని హామీ రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : చికాగో దేశం లోని గవర్నర్స్ స్టేట్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడ్డ భారతీ నగర్ డివిజన్ కు చెందిన సాయి చరణ్ కుటుంబాన్ని మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని, సాయి చరణ్ త్వరగా కోలుకోవాలని […]

Continue Reading

అభివృద్ధి… సంక్షేమం రెండు కళ్ళు – పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

– ఒకే రోజు 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : నూతనంగా ఏర్పడిన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో 23 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ […]

Continue Reading

గీతం బీ-స్కూల్లో ‘అల్గారిథమిక్ ట్రేడింగ్’పై వర్క్ షాప్…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ (జీఎస్బీ); నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 31 తేదీన ‘ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫైనాన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్’ పై రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి. గతంలో అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన ఈ వర్క్షాప్ను తిరిగి ఈ నెలాఖరున నిర్వహించనున్నట్టు జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్. రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

♦ శిశు విహార్ హై స్కూల్ లో ఘనంగా యానివల్ డే కార్యక్రమం ♦ కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : :విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ లో చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అనిల్ కె. పిల్లై, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్.బీనా పిల్లై ల ఆధ్వర్యంలో ఘనంగా యానివల్ […]

Continue Reading