ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

  పటాన్చెరు పటాన్చెరు డివిజన్ కి చెందిన లూష్మ గత కొద్దిరోజులుగా నిమ్స్ ఆస్పత్రిలోచికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 90 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు లూష్మ కుటుంబీకులకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్వోసీనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

టీకాతోనే కోవిడ్ కట్టడి – ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి

పటాన్‌చెరు: ఈ శతాబ్దంలోనే కోవిడ్ -19 మహమ్మారి అత్యంత ఘోరంగా ఉందని, మొత్తం ప్రపంచ జనాభాకు టీకాలు వేయడం ద్వారానే దానిని కట్టడి చేయగలమని అఖిల భారత వైద్య సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం విజయవంతంగా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గీతం ఫౌండేషన్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ గీతం 41వ ఫౌండేషన్ అవార్డును ప్రొఫెసర్ […]

Continue Reading

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించిన్నప్పుడే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

సాయి కాలనీ బ్రిడ్జి పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్: బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి […]

Continue Reading

చదువుతోనే సమాజ అభివృద్ధి : యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

గుమ్మడిదల: చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల […]

Continue Reading