రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు

Hyderabad Telangana

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు

 

తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత కీర్తిశేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 10వ వర్ధంతిపురస్కరించుకుని భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,ఎల్. ఐ. జి లో గల వార్డ్ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ దేవేంద్ర చారి, బీసీ ప్రెసిడెంట్ నర్సింహ చారి, మైనారిటీ ప్రెసిడెంట్ అజీముద్దీన్, వార్డ్ మెంబెర్ యాదగిరి రెడ్డి,నారాయణ రెడ్డి, పాటి సత్యనారాయణ, కృష్ణ గౌడ్,జగన్మోహన్ చారీ, జావిద్, షకీల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *