– ఇస్నాపూర్ పాలకవర్గానికి షోకాజ్ నోటీస్
– సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
పటాన్‌చెరు:
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం వహించినందున సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పాలకమండలి అనుమతి లేని లే అవుట్లలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి తీర్మానించి, అనుమతులు ఇచ్చినందున సంబంధిత గ్రామ పంచాయితీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇస్నాపూర్ పంచాయతీ కార్యదర్శి వై.హరిబాబుకు చార్జి మెమో ఇచ్చి, బదిలీ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పటాన్‌చెరు మండల పంచాయితీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…