పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad Telangana

హరితహారం తో సకాలంలో వర్షాలు…

– పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు:

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఇందుకు నిదర్శనం ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు ప్రారంభం కావడమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎక్సైజ్ శాఖ మరియు గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న నగరీకరణ, జనాభా మూలంగా రోజురోజుకి వాతావరణం లో సమతుల్యత లోపించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ద్వారా కోట్ల మొక్కలు నాటడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి ఏటా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో సామాజిక అడవులను పెంచుతున్నట్లు తెలిపారు.

అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం లో భాగంగా గ్రామంలో ఆరు వందల ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి దేవి, గ్రామ సర్పంచ్ జగన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *