మనవార్తలు శేరిలింగంపల్లి :
సామాజికవేత్త ఆనంద్ తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిల్లా శేరి లింగంపల్లి నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. పుట్టిన రోజున హంగు ఆర్బాటాలు లేకుండా పేదవాళ్లకు సహాయం చేయడం పై కాలనీవాసులు ఆనందం ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున తమకు ఉన్నంతలో పేదల కడుపు నింపేందుకు సహాయపడాలని ఆనంద్ కోరారు. పుట్టిన రోజున పేదలకు సహాయం అందించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఒకపూట అయిన మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు.