నియోజకవర్గంలో కంటి వెలుగు అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం

politics Telangana

_కార్యక్రమం ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి

_అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పాల్గొనండి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో ఏ ఒక్కరు కంటి సమస్యతో బాధపడకూడదన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారని, గురువారం నుండి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని స్థాయిల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 19వ తేదీ నుండి నియోజకవర్గంలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి రోజు ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన శిబిరంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు, అవసరమైన వారికి తక్షణమే నాణ్యమైన రీడింగ్ గ్లాసెస్ అందించడంతో పాటు, ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమైన వారికి రెండు వారాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకుగాను పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు ఆపరేషన్లు అవసరమైన వారి జాబితాను సేకరించాలని సూచించారు.అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు పూర్తి అంకితభావంతో పనిచేస్తే కంటి వెలుగు విజయవంతం అవ్వడమే కాకుండా, గ్రామాలలో మంచి పేరు వస్తుందని అన్నారు.గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో కంటి వెలుగు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ మనోహర్ రెడ్డి, వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *