చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే బాక్సింగ్ క్రీడాకారులకు ఎమ్మెల్యే అనంత అభినందనలు

Andhra Pradesh Districts

అనంతపురం :

గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయ స్థాయి బాలికల బాక్సింగ్ పోటీల్లో నగరానికి చెందిన దీక్షిత,పెద్దక్క,శిల్ప,గీత,పూజలు పతకాలు సాధించారు. వీరంతా మంగళవారం ఎమ్మెల్యే అనంతను ఆయన స్వగృహంలో కలిశారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలంపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి, బాక్సింగ్ కోచ్‌ మహేష్ కుమార్,అబ్జల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *