దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం
చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం విమానయానం టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహనీయుడీ సొంతమన్నారు. భారత దేశ అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధి లో మేటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్, నాయకులు అశోక్, శ్రీనివాస్, వీరేష్, అనిల్, రాజ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…