విజయవాడ
ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు తొలగించారు.మరి కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి.ఇప్పుడు దేముడి గుడిని కూడా వదలడం లేదు.బులుగు,ఆకుపచ్చ బల్బులతో బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్ బల్బులతో అలకరించేశారు..ఎవరు ఇచ్చారో ఈ ఐడియా కానీ రాత్రి వేళ అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ వైసీపీ పార్టీ జెండా రంగులే కనపడుతున్నాయి.
ఇలాంటి సంస్కృతి తీసుకురావడం ఇదే ప్రథమం అని విశ్లేషకులు భావిస్తున్నారు..ఈ విధంగా భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినే విధంగా ఆలయ అధికారులు తీసుకువస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
