పటాన్చెరు
వినాయక చవితినీ పురస్కరించుకొని ప్రసిద్ధ రుద్రారం సిద్ధి గణపతి వినాయకుడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఎంపిటిసి రాజు, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దంపతులు, గుడెం కల్పన మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.