మియాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :
మియాపూర్ ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌లో ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి–దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డా. యలమంచి ఉదయ్ కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. యలమంచి ఉదయ్ కిరణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు చంద్ర మౌళి, ఆనంద్, మహేందర్ తదితరులు డా. యలమంచి ఉదయ్ కిరణ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి వెల్లివిరియాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయుడు, నాగిరెడ్డి, గంగాధర్, సంజయ్, శరత్, కామినేని వాసు, వంశీ, నాని, అశోక్, ప్రవీణ్, రాజశేఖర్, రత్నాచారి, వినోద్, శశి తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…