పటాన్‌చెరు
దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ బండ్లగూడ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు. జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టాలని సూచించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు