Hyderabad

ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

హైదరాబాద్

భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) గా ఉన్న ఈయనను భారత వాయుసేన కొత్త చీఫ్ గా నియమించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వెంకటరామ్ చౌదరి 29 డిసెంబర్ 1982 న ఎయిర్ ఫోర్స్ యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఈయనకు వివిధ రకాల ఫైటర్ మరియు ట్రైనర్ ఎయిర్‌ క్రాఫ్ట్ లను నడిపిన అనుభవం ఉంది.

ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఈనెల 30 న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన నుంచి చౌదరి కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపడతారు. వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది జూలై 1 న వైమానిక సిబ్బంది డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళానికి వైస్ చీఫ్‌గా నియమించబడటానికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు.వివేక్ రామ్ చౌదరి బి హెచ్ ఈ ఎల్ , హైదరాబాద్ ప్రాంత నివాసులు. హై్యర్ సెకండరీ స్కూల్ లో విద్యను అభ్యసించారు. తండ్రి బి హెచ్ ఈ ఎల్ ఎంప్లాయ్ గా రిటైర్ అయ్యారు, తల్లి స్కూలు టీచరు గా పని చేశారు.

 

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago