పటాన్చెరు
విజయదశమి వేడుకలు పటాన్చెరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట గల బుద్ధుడి విగ్రహం వద్ద పతాక ఆవిష్కరణ నిర్వహించారు.. అనంతరం ఉత్తర దిక్కున గల జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో పురోహితుల సమక్షంలో శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, మాజీ జెడ్ పి టి సి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, పట్టణ పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జీఎంఆర్ కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
విజయ దశమిని పురస్కరించుకుని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసం అభిమానులతో సందడిగా మారింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…