_చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు,చాకలి ఐలమ్మ 128 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహం కు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పూలమాలవేసి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. నిజాం రజాకార్ల నిరంకుశ పాలనలో వెట్టి చాకిరితో మగ్గిపోయిన బతుకులను బాగు చేయడానికి, బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆనాడు ఆమె చేపట్టిన ఉద్యమం అణచివేతను ప్రశ్నించేలా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో రాష్ర్టంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని గత సంవత్సరం చిట్కుల్ గ్రామంలో ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు.అదే ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని తాను సైతం ముందుకు వెళ్తున్నానని తెలిపారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూ స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని వెల్లడించారు. అన్ని సబ్బండ వర్గాల ప్రజల ఆశీర్వాదంతో అందరితో చర్చించి త్వరలో తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తూవారి ఆధారభిమానాలతో మరింత సేవ చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవో కవిత , ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, భుజంగం,వెంకటేశ్, రాజ్ కుమార్,యాదగిరి,ఆంజనేయులు, మాజీ PACS చైర్మన్ నారాయణ రెడ్డి, మన రజకసంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,గౌరీ శంకర్,అనిల్,సంఘం సభ్యులు సత్తయ్య,అర్జున్,బాబు,శేఖర్,కిషోర్, గోపి, గ్రామ పెద్దలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…