వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఉద్యోగ, వ్యాపార వేత్తలు తలా ఒకచేతివేసి 60వేల రూపాయలను రమ్య, సింధులపేరుమీద పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. గ్రామంలోని ఉద్యోగ, వ్యాపారుల సహకారంతో అక్కాచెల్లెళ్ల ఉన్నత చదువులకు సహాకరిస్తామన్నారు ఉపాధ్యాయుడు పులిదేవేందర్ ముదిరాజ్. పార్టీలకు అతీతంగా చిన్నారులకు సహాయం చేస్తామని సర్పంచ్ మాజీ సర్పంచ్ అందె వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో కలామ్స్ ఫౌండేషన్ కార్యదర్శి పరికి మధుకర్ తోపాటు పోస్ట్ ఆఫీసర్ కొన్ రెడ్డి సాంబరెడ్డి, వట్టే రవి కిరణ్, రాజనాల రాజు, దొనకొండ కర్ణాకర్ రెడ్డి, వట్టే శీను,మాడుగుల కుమారస్వామి,గుల్లపల్లి స్వామి, మెరుగు కుమారస్వామి,కటుకూరి రాజు, కుక్కల రాజాలు, కుమార్, అశోక్, కుక్కల మహేందర్,సాంబరాజు, కుక్కల రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…