Hyderabad

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పటాన్ చెరు:

నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి టోల్ గేట్ వద్ద గల జలమండలి కార్యాలయం వరకు నూతన పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

రెండో దశలో నక్క వాగు నుండి పోలీస్ స్టేషన్ వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డీఎస్పీ భీమ్ రెడ్డి, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, జలమండలి ఉన్నతాధికారులు, పిఎసిఎస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

24 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

24 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

1 day ago