హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి…

Hyderabad

 హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి…

– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్:

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారాం హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…  వీర హనుమాన్ కరుణా కటాక్షాలు, ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మ‌హమ్మారి నుంచి త్వ‌ర‌గా దేశ ప్రజలను ప్ర‌ధానంగా మ‌న రాష్ట్రానికి విముక్తి క‌ల‌గాల‌ని ఆ వీర హనుమాన్ ని మనసారా కోరుకుంటున్నాని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.