– ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని
– గ్రామీణ పేద విద్యార్థులకు చేయూత
– ది మాస్టర్ మైండ్స్ స్కూల్ లో ఘనంగా ఆనివల్ డే కార్యక్రమం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంటిగ్రేట్ సిస్టంతో రేపటి ఉత్తమ భావి భారత పౌరులుగా ది మాస్టర్ మైండ్స్ విద్య సంస్థలు తీర్చిదిద్దుతు ఉత్తమ విద్యకు చిరునామగా నిలుస్తున్నాయని ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో శనివారం సాయంత్రం ది మాస్టర్ మైండ్స్ స్కూల్ లో డైరెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఆనివల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చైర్మన్ రాజు సంఘాని మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యను అందిస్తూ 50 బ్రాంచీలకు పైగా ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ నడుపుతున్నట్లు పేర్కొన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో సీబీఎస్సీ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి కోర్సులను కొనసాగించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చదువులో మెలుకువలు నేర్పుతూ వారికి చేయూత నిస్తున్నట్లు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చక్కటి విద్యను అందిస్తున్నామన్నారు.
రోజువారీగా విద్యార్థులకు చదువుపై దృష్టి మళ్లించే విధంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చదువుతోపాటు లైఫ్ స్కిల్స్, గ్రామర్ తో ఇంగ్లీష్ లో సీఎల్డీపి ప్రోగ్రాం చేపడతామని చెప్పారు. 6 నుండి 10 వరకు విద్యార్థులకు ఐఐటి, మెడికల్ ఎంట్రన్స్ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుందన్నారు. సెంట్రల్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. పటాన్ చెరు పారిశ్రామికవాడ ప్రాంతంలో సామాన్య, మధ్యతరగతి వారే ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన విద్యను అందించటంతో పాటు విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆనివల్ డే కార్యక్రమం సందర్భంగా కలర్ ఫుల్ లైటింగ్ లో విద్యార్థిని విద్యార్థులు చేసిన డ్యాన్సులు, సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మాజీ సర్పంచ్ నర్సింలు, రామేశ్వరంబండ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారి ధరణి అంతిరెడ్డి, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి గారి అంతిరెడ్డి, స్కూల్ డైరెక్టర్లు నాగరాజు, శివ నాయక్, రామకృష్ణ, ప్రిన్సిపల్ దీప ప్రవీణ్, టీచర్లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…