మనవార్తలు ,అమీన్పూర్:
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా ముందుండి నడుస్తూ తెలంగాణ సాధనలో బాగస్వాముడైన ఉద్యమకారుడు యువ న్యాయవాది సింగారం ఓం ప్రకాష్ బిఎస్పి పార్టీలో చేరారు.గురువారం అమీన్పూర్ నుండి 300 మందితో ర్యాలీగా బయలుదేరి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బిఎస్పీ కండువా కప్పుకున్నారు. సుల్తాన్పూర్ కు చెందిన టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి చిన్న గల్ల గిరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పి లో చేరారు
ఈ సందర్భంగ సింగారం ఓం ప్రకాష్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని మెచ్చి ప్రవీణ్ అడుగు జాడల్లో నడవాలని బీఎస్పీలో చేరుతున్నానని ఆయన అన్నారు. బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత తోనే బహుజన రాజ్యం సాధ్యమని నమ్మి రాజ్యాధికార దిశగా పయనిస్తున్న బీఎస్పీకి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బహుజన రాజ్యాధికారం దిశగా అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ ,పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జ్ సంజీవ, పటాన్ చెరు అసెంబ్లీ అధ్యక్షుడు వినయ్, సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ జగదీష్, నాయకులు శ్రీశైలం, సుదర్శన్, రాములు, జనార్ధన్, బేగరి,రమేష్ శీను, రేణుక, నవనీత బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…