Categories: politics

సాంకేతికతను ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి

గీతం విద్యార్థులకు సూచించిన టీసీఎల్ విభాగాధిపతి డాక్టర్ ఇంద్రాని ప్రమోద్ కెల్కర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను విద్యార్థులు పెంపొందించుకోవాలని, సాంకేతికతను ఆలోచనాత్మకంగా ఉపయోగించాలని హైదరాబాదులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ ఐయాన్ నాణ్యత (క్వాలిటీ), విశ్లేషణ (అనలిటిక్స్) విభాగాధిపతి డాక్టర్ ఇంద్రాని ప్రమోద్ కెల్కర్ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు లోని మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘సాంకేతికత, మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆరోగ్యానికి సంబంధించిన- మేధోపరమైన, పర్యావరణ, సామాజిక, భావోద్వేగ, ఆర్థిక, ఆధ్యాత్మిక, వృత్తిపరమైన, శారీరక వంటి ఎనిమిది అంశాల మధ్య సమతుల్యతను పాటించాలని ఆమె స్పష్టీకరించారు.

మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ కెల్కర్ నొక్కి చెబుతూ, టెక్నాలజీ ఒక విలువైన వనరుగానూ, అదే సమయంలో ఒత్తిడికి కారణమయ్యే అంశంగానూ ఎలా ఉండగలదో వివరించారు. మానసిక ఆరోగ్య సమాచారం, ఆన్ లైన్ కౌన్సెలింగ్, తోటివారి మద్దతు, అభ్యాస వనరులు, సంపూర్ణ శ్రేయస్సు ద్వారా సాంకేతికత వల్ల కలిగే సానుకూల ప్రభావాలను ఆమె చర్చించారు. అదే సమయంలో, అధిక స్క్రీన్ సమయం, సోషల్ మీడియా వాడకం, సాంకేతిక పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం (డిజిటల్ ఓవర్ లోడ్), సైబర్ బెదిరింపులు, సామాజిక పోలిక, నిద్రకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విద్యా షెడ్యూల్స్ ఒత్తిడి (డిమాండింగ్ అకడమిక్ షెడ్యూల్స్), ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, సరిపోని నిద్ర కారణంగా ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థులు ముఖ్యంగా ఒత్తిడి, తీవ్రమైన మానసిక అలసట (బర్న్ అవుట్)కు గురయ్యే అవకాశం ఉందని కెల్కర్ చెప్పారు. భవిష్యత్ సాంకేతిక నిపుణులుగా విద్యార్థులు తమ డిజిటల్ శ్రేయస్సుకు బాధ్యత వహించాలని, అభ్యాసం, ఉత్పాదకత, సృజనాత్మకత, స్థితిస్థాపకతను పెంపొందించడానికి సాంకేతికతను ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. డిజిటల్ అలవాట్లు, డిజిటల్ డిటాక్స్, మానసిక ఆరోగ్యానికి సాంకేతికత ఏవిధంగా మరింత తోడ్పడగలదు అనే అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని డాక్టర్ కెల్కర్ సూచించారు. గీతం మహిళా సాధికారత సెల్ ఛైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి పర్వేకర్, సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

13 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago