మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీకి చెందిన లక్ష్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరు అయింది. మంగళవారం లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎల్వోసీ కి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.
Continue Reading