వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు 

మనవార్తలు,సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని వివేకానంద ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించే మెన్స్ డబుల్ ఫస్ట్ ఎడిషన్ వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను పటాన్ చెరు మాజీ సర్పంచ్, వివేకానంద ఇండోర్ స్టేడియం చీఫ్ పట్టర్న్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు శనివారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు గారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు యువకులు చదువుతోపాటు […]

Continue Reading

మెహఫైల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు 

మనవార్తలు- పటాన్ చెరు ఆహారం మనిషి జీవితంలో అత్యంత అవసరం తో పాటు అత్యంత ప్రాధాన్యమైనదని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు. పటాన్చెరు మండల పరిధి ముత్తంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెహఫైల్ బిర్యాని రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ భోజనంలో నాణ్యత పాటిస్తూ అందరి మన్ననలను పొందాలని సూచించారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా కోణంలో కూడా చూడాలన్నారు. […]

Continue Reading

మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం : పటాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు

పటాన్ చెరు: మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. […]

Continue Reading

కరోనా వారియర్స్ కు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కారం

పటాన్చెరు: పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్, టీకా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కరోనా సమయంలో వాళ్ల పాత్ర మరువువలేనిదిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడి తమ విధులను నిర్వహించి హ్`దేశానికే ఆదర్శనంగా నిలిచారని పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ […]

Continue Reading

వలస కార్మికురాలికి అంత్యక్రియలు నిర్వహించినఎండీఆర్ ఫౌండేషన్

పటాన్ చెరు: మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా రూపాంతరం చెందిన నేటి పరిస్థితుల్లో ఎండీఆర్ ఫౌండేషన్ మానవతా కోణంలో సేవ చేస్తోంది. మరణించిన తరువాత దగ్గరి వారు కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకునే రోజులివి. కానీ పటాన్ చెరు కేంద్రంగా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నఎండీఆర్ ఫౌండేషన్ మాత్రం అనాధలకు అన్నీ తానై ఆదుకుంటుంది. తాజాగా ఒరిస్సా నుండి వలస వచ్చి చనిపోయిన ఓ మహిళకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించింది ఎండీఆర్  […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ …

పటాన్ చెరు(గుమ్మడిదల): ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ సర్పంచ్ , ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లిలోని ప్రైమరీ స్కూల్‌లో టీవీ సౌకర్యం లేక ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దేవేందర్ రాజు స్కూల్‌కు పదహారు వేల విలువ చేసి టీవీని అందించారు. పాఠశాలలో చదువుతున్న ముప్పై […]

Continue Reading

పరిమళించిన మానవత్వం….

పరిమళించిన మానవత్వం ….  పటాన్ చెరు: 72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని , నెగిటివ్ వస్తే ఆశ్ర మానికి రావాలని , పాజిటీవ్ వస్తే రావొద్దని చెప్పి పంపారు. దీంతో ఆమె పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ టెస్టు చేయించుకోవడానికి శనివారం రాత్రి 9 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుంది . ఆపై […]

Continue Reading