పాశమైలారం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. పోతురాజుల నృత్య విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.    

Continue Reading
MAHIPAL

ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్ చెరు పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీ లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన చర్చి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని తద్వారా వ్యాధులను […]

Continue Reading

ఇంటింటా పచ్చదనం నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి :ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి

నందిగామ హరితహారంలో  మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లో హరితహారం కార్యక్రమానికి చైర్మన్ భూపాల్ రెడ్డి తోపాటు,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ […]

Continue Reading