3 లక్షలకు లడ్డు దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులు

మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా మహబూబ్ పెట్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి శనివారం సాయంత్రం నిమజ్జన సమయంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో 3 లక్షల ఒక్క రూపాయికి హనుమాన్ యూత్ సభ్యులు దక్కించుకున్నారు. ఆ భగవంతుని ఆశిష్యులు అందరి పై ఉండాలని కోరుకుంటున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.  

Continue Reading