గొర్రెలిస్తే సరిపోదు మేపేందుకు స్థలం ఇవ్వాలి -ప్రతి గ్రామానికి పది ఎకరాల స్థలం కేటాయించాలి
రామచంద్రపురం తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు […]
Continue Reading