అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,అమీన్పూర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మారుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం అమిన్ పూర్ మండల పరిషత్ అధ్యక్షులు దేవానంద్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని పనిచేసి ఇటు ప్రభుత్వానికి అటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని […]

Continue Reading

దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్

శాసనమండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు పటాన్చెరు 60 లక్షలకు పైచిలుకు సభ్యత్వంతో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల ప్రాంతీయ పార్టీగా నిలుస్తోందని శాసన మండలి మాజీ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెలాఖరు లోపు ముగుస్తుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పార్టీ సంస్థాగత […]

Continue Reading

కోటి రూపాయలతో అమీన్పూర్ లో వైకుంఠధామం

అమీన్పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్స్ కాలనీలో గల ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి గ్రామంలో […]

Continue Reading

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజు, రమేష్ గౌడ్ […]

Continue Reading

ఘనంగా ముగిసిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ

విజేతలకు బహుమతులు అందజేసిన గూడెం విక్రమ్ రెడ్డి    అమీన్పూర్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంచుతాయని టిఆర్ఎస్ యువ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రారంభించిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విక్రమ్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు […]

Continue Reading

నడిగడ్డ తాండ వాసులకు మద్దతుగా ధర్నా

హైద్రాబాద్: మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ లో సిఆర్పిఎఫ్ క్యాంపస్ వద్ద నడిగడ్డ తాండ మరియు సుభాష్ చంద్రబోస్ లో నివసిస్తున్న ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న సిఆర్పిఎఫ్, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను వారి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ధర్నా చేయడం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి ఇదివరకే బిజెపి పార్టీ తరఫున ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ […]

Continue Reading