మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. […]

Continue Reading

దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్

శాసనమండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు పటాన్చెరు 60 లక్షలకు పైచిలుకు సభ్యత్వంతో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల ప్రాంతీయ పార్టీగా నిలుస్తోందని శాసన మండలి మాజీ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెలాఖరు లోపు ముగుస్తుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పార్టీ సంస్థాగత […]

Continue Reading

ఆరుట్ల హనుమాన్ దేవాలయం భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్చెరు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించతలపెట్టిన హనుమాన్ దేవాలయం భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి తనతో పాటు తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు టిఆర్ఎస్ […]

Continue Reading

 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూమి పూజ

కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మాణం పటాన్చెరు: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading

50 మంది లబ్ధిదారులకు 16 లక్షల 55 వేల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన 16 లక్షల 50 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి […]

Continue Reading

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం, పటాన్చెరు పట్టణంలోని తెలంగాణా అమరవీరుల స్థూపం,జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, మైత్రి మైదానం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపిడిఓ, తహసిల్దార్, ఆత్మ కమిటీ, ఆటో యూనియన్, గ్రంథాలయం కార్యాలయాల వద్ద […]

Continue Reading

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

ఫలహారం బండి ఊరేగింపు లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు పటాన్చెరువు పట్టణంలో బోనాల పండుగ, ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి. జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుండి చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ తీన్మార్ […]

Continue Reading

పటాన్చెరు లో ఘనంగా బోనాల పండుగ

అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ ఆషాడ మాస బోనాల సందర్భంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల పండగ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు […]

Continue Reading

టిఆర్ఎస్ శ్రేణుల హర్షం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా కాల్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక నిర్ణయం అని అన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే […]

Continue Reading