ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి

అమీన్ పూర్: ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మెగా హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి హెచ్ […]

Continue Reading

అభివద్ధి పథంలో అమీన్ పూర్…

చైర్మన్‌ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం… అమీన్ పూర్: ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలకు అనుగుణంగా అమీన్పూర్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. బుధవారం చైర్మన్‌ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలతో నిర్వహించతలపెట్టిన అభివద్ధి కార్యక్రమాలకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు […]

Continue Reading
AMEENPUR

శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్ అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామం బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ లో నిర్మించ తలపెట్టిన శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత […]

Continue Reading

విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 విద్యుత్తు విద్యుత్ ఫీడర్ ప్రారంభించిన ఎమ్మెల్యే -గూడెం మహిపాల్ రెడ్డి అమీన్ పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సబ్ స్టేషన్ నుండి వడక్ పల్లి వరకు ఏర్పాటు చేసిన నూతన ఫీడర్ లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading
ROADS

ప్రతి కాలనీనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే జిఎంఆర్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. […]

Continue Reading
AMEENPUR.jpg

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్   అమీన్పూర్ సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 […]

Continue Reading
Ameenpur

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే …

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… అమీన్ పూర్: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ లో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ విస్తరిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులకు ప్రథమ […]

Continue Reading