-జర్నలిజంపై హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్ సోమశేఖర్ వ్యాఖ్య
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జర్నలిజంలో విజయం సాధించాలంటే భావవ్యక్తీకరణ, ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ సోమశేఖర్ ములుగు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎహెచ్ఎస్)లోని మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం ‘జర్నలిజంలో మార్గదర్శనం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై సోమవారం అతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.జర్నలిజం ఐదు దశల గురించి (1950-90 ప్రతికలు, రేడియో: ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో 1991 నుంచి ఫెనాన్షియల్ న్యూస్ పేపర్ల్ ఆగమనం: గూగుల్ సృద్ధితో 2000 నుంచి డిజిటల్ మీడియా: 2010-20 సోషల్ మీడియా నిబృంభణ: ఇక కోనిడ్ నేపథ్యం, కృత్రిమ మేథల సాయంతో వర్తమాన పాత్రికేయం), సాంకేతిక పురోగతితో పరిశ్రమ, పాత్రికేయం ఎలా రూపాంతరం చెందాయో సోమశేఖర్ వివరించారు. ప్రారంభ దశంలో సంప్రదాయ వార్తాపత్రికలు, రేడియో నుంచి ఇటీవలి డిజిటల్ మీడియా, సామాజిక వేదికల అనిర్భావం వరకు, మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం నిరంతరం అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.
జర్నలిజంలో మంచి రచన, మాట్లాడే నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన సోమశేఖర్, కంటెంట్ రెటింగ్, ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని ఔత్సాహిక పాత్రికేయులను ప్రోత్సహించారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల పెరుగుదలను ప్రస్తావిస్తూ, ఇక్కడ ఆయా వ్యక్తులు తను ప్రతిభను ప్రదర్శించవచ్చని, తాము అనుకున్నది ఎటువంటి పరిమితులు లేదా నిబంధనల చట్రం వంటివి లేకుండా చెప్పొచ్చని, సొంత ప్రేక్షకులు / వీక్షకులను పొందవచ్చని చెప్పారు.వర్ధమాన జర్నలిస్టులు తమ నెపుణ్యం ఆధారంగా మీడియాను ఎంచుకోవాలని, మంచి కథనం, దానిని ఆకట్టుకునేలా చెప్పగలిగే సామర్ధ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని సోమశేఖర్ సూచించారు.తొలుత, జీఎహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని స్వాగతించారు, మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడగమ్మ బాలకృష్ణ సోమశేఖర్ ను సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గామన్ పాలెం వందన సమర్పణ చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను అడిగి, నివృత్తి చేసుకున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…